తగ్గుముఖం పడుతోన్న కరోనా!

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. తొలిసారి 40 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 36,370 కొత్త కేసులు నమోదయ్యాయి. జులై మధ్యలో ప్రారంభమైన విజృంభణ సంఖ్యతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 79.46 లక్షలకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్లో తెలిపింది. జులై 18న 36 వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో 488 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,19, 502కు చేరువైంది. దాదాపు 90.23 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 8.26 శౄతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్లో పేర్కొంది.