నార్వేకు చైనా వార్నింగ్‌

మాలో మాకు చిచ్చు పెట్టారో జాగ్ర‌త్త‌!

 

న్యూఢిల్లీ: నేడు ప్ర‌పంచంలోనే అమెరికాకు ధీటుగా జ‌వాబివ్వ‌గ‌ల‌దేశం స్థాయికి చైనా ఎదిగింద‌ని ప్ర‌పంచ విశ్లేష‌కుల అభిప్రాయప‌డుతున్నారు. 20 యేళ్ల‌నుండి ద‌క్షిణాసియాలో త‌న స‌త్తా చాటాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తూ భార‌త్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన చైనా నేడు ఇత‌ర దేశాల వ్య‌వ‌హారాల్లో కూడా జోక్యం చేసుకొంటోంది. మొన్నటికి మొన్న లధాఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో చైనా చోరబాట్ల గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా ఇండియా హెచ్చరికల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఆసియాలోనే కాదు, యూరప్ దేశాలపై సైతం పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తోంది. కాగా ఇటీవల హాంకాంగ్‌లో చైనా భద్రత చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ నిరసనలు జరగుతున్నాయి. అయితే ఆ నిరసనకారులకు నార్వే నోబెల్‌ కమిటీ నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకుందో, ఏమో ఆ విషయం చైనాకు తెలిసినట్టుంది. ఈ నేపథ్యంలో చైనా ఫారిన్‌ మినిస్టర్‌ వాంగ్‌ ఇ నార్వేకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ‘మా వాళ్లకు గనుక నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చి మాలో మాకు చిచ్చు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం’ అని హెచ్చరించారు. ఇక్కడ ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్‌కు అని దీని అర్థం. నోబెల్‌ బహుమతులు అందజేసేది స్వీడన్‌ అయినప్పటికీ శాంతి బహుమతి మాత్రం నార్వేనే ఇస్తుంది. దీంతో ముందు జాగ్రత్తగా చైనా నార్వేను బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా గ‌తంలో బ్రిట‌న్‌ను కూడా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.