నెటిజన్లు ఫిదా.. చెట్టును ఇలా కూడా కట్ చేస్తారా?
ఆకాశమంత ఎత్తులో ఉన్న తాటి చెట్టును ఓ వ్యక్తి నరికేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమెరికన్ మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో శుక్రవారం షేర్ చేశాడు. ఆ విడియో ఒక్కసారి చూస్తే జీవితమంతా మరిచిపోలేరు! వీడియోలో చెట్టుమీద వ్యక్తి కూర్చున్న కొమ్మ ఒకవైపునకు ఒక్కసారి వంగిపోతుంది.. అప్పుడే ఎకంగా చెట్టునే నరికి పారేశాడు. వీడియో ప్రారంభంలో అతడు చెట్టు చివరకు చేరుకున్నాక చెట్టు ఓ వైపుకు ఒంగుతుంది. ఆ సమయంలో అతడు చెట్టు చివరన ఉన్న కొంత భాగాన్ని నరికేస్తాడు. చెట్టు పైభాగం కిందపడిపోవడంతో మిగతా భాగమంతా పెను గాలికి ఊగినట్టు అటూ ఇటూ ఊగిపోయింది. చెట్టును అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి కూడా అటూ ఇటూ ఊగుతూ అప్పుడో ఇప్పుడో కింద పడి పోతాడేమో.. పడితే ప్రాణాలు ఉంటాయా అనే భయం కలిగిస్తాడు. ఇంత ఉత్కంఠకలిగిన వీడియోకు ‘ఎవరైన అతి పొడవాటి తాటి చెట్టును నరకడం చూశారా’ అనే టైటిల్‌తో నెట్లో షేర్ చేశాడు.
ఇది అమెరికాలోని లాస్ యాంజిలిస్ ప్రాంతంలో జరిగిందని కూడా ట్విటర్ సంవాదం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ దీనికి 60 లక్షల వ్యూస్, 81 వేల లైకులు వచ్చిపడ్డాయి.
34 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 6.6 మిలియన్ వ్యూస్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఆ వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఫుల్ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను అమెరికా బాస్కెట్ బాల క్రీడాకారుడు రిక్స్ ఛాప్మెన్ తొలిసారి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఇంటర్నెట్లో నెటిజన్లను ఫిదా చేస్తున్న ఈ వీడియో మీ కోసం.. వెంటనే చూసి షాకైపొండి!