పశువుల హాస్టల్‌ భేష్‌: మంత్రి హరీశ్‌కు కేటీఆర్ ప్ర‌శంస‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావును రాష్ట్ర ఐటి, మున్సిప‌ల్ మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంసించారు. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల గ్రామ శివారులో పశువుల కోసం కమ్యూనిటీ డెయిరీ హాస్టల్‌ను ప్రారంభించి, నియోజకవర్గంలో మరో ఎనిమిది చోట్ల వీటి ఏర్పాటుకు కృషిచేస్తున్న ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావును ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విట్టర్‌లో ప్రశంసించారు. డెయిరీ ఉత్పత్తులు పెంచేందుకు ఇలాంటి సౌకర్యాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. అలాగే రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలు ఇంటింటా సేకరించిన తడిపొడి చెత్తతో ‘రాజన్న సేంద్రియ ఎరువు’ పేరిట కంపోస్ట్‌ ఎరువును తయారుచేస్తుండటం అద్భుతమని మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.