పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపిల ఆందోళన

న్యూఢిల్లీ : రాష్ట్రాలకు వెంటనే జిఎస్టి బకాయిలు చెల్లించాలంటూ పలువురు ఎంపిలు ఆందోళనకు దిగారు. టిఆర్ఎస్, టిఎంసి, డిఎంకె, ఆర్జెడి, ఆప్, ఎన్సిపి, సమాజ్వాది, శివసేన ఎంపిలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. కరోనా మహమ్మారిని ‘యాక్ట్ ఆఫ్ గాడ్’గా పేర్కొంటూ జిఎస్టి పరిహారాలు విడుదల చేయలేమంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు తిరస్కరిస్తూ.. నిధులు విడుదల చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశాయి.
#WATCH Delhi: TRS, TMC, DMK, RJD, AAP, NCP, Samajwadi Party and Shiv Sena MPs protest in front of Mahatma Gandhi statue at the Parliament premises, demanding GST payments to states. pic.twitter.com/x9f5azAY0I
— ANI (@ANI) September 17, 2020