పినాక అధునాతన వెర్షన్‌ పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: ఆధునిక ఆయుధాలను, అత్యాధునిక క్షిపణుల ప్రయోగాలలో దూకుడును ప్రదర్శిస్తున్న డీఆర్డీఓ బుధవారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం నిర్వహించిన ప్రయోగంలో ఒకేసారి ఆరు రాకెట్లను టెస్ట్ చేశారు. ఆరింటికి ఆరు విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాలని డీఆర్డీఓ ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మొత్తం 6 రాకెట్లను ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. పినాక క్షిపణి అధునాతన వెర్షన్‌కు సంబందించిన అన్ని పరీక్షలు మిషన్ లక్ష్యాలను పూర్తిగా చేరుకున్నాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి పరికరాల ద్వారా క్షిపణి పనితీరును పరిశీలించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని పరిమితులను ఇది చేరుకున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి ఉత్పత్తి దశలో ఉన్న పినాక ఎంకేఐ స్థానాన్ని ఈ అధునాతన వెర్షన్‌ భర్తీ చేస్తుందని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.

 

Leave A Reply

Your email address will not be published.