పెనుగొండలో చెరువులో పడి నలుగురి మృతి
పెనుగొండ: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలలో విషాదం చోటుచేసుకుంది. పెనుగొండలోని భోగసముద్రం చెరువులో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు విహార యాత్రకు వెళ్లి సరదాగా ఈతకు దిగారు. వారిలో నలుగురు నీటిలో మునిగిపోయారు. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.