పేద విద్యార్థుల‌కు సోనూసూద్ స్కాల‌ర్‌షిప్‌లు

ముంబ‌యి: ఇప్పుడు దేశంలో సోనూసూద్ అంటే తెలియ‌నివారుండ‌రు.. కేవ‌లం న‌టుడిగానే కాకుండా క‌రోనా స‌మ‌యంలో వేల మందిని ఆదుకుని గొప్ప మ‌న‌సున్న మ‌నిషిగా దేశమంతా రియ‌ల్‌హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు నటుడు సోనూ సూద్. ఎంతో మంది వలస కార్మికులను ఇళ్లకు చేర్చాడు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరో పెద్ద సమస్య సోనూ దృష్టికి వచ్చింది. తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించడానికి అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు  పడుతున్న ఇబ్బందులను సోనూ గమనించాడు. దీంతో వీరిని ఆదుకునేందుకు రంగంలోకి దిగాడు.వారందరి కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు. మ‌ర‌ణించిన త‌న త‌ల్లి ప్రొఫెస‌ర్ స‌రోజ సూద్ పేరుతో పేద విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. scholarships@sonusood.me మెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోమ‌ని కోరారు.

వార్షికాదాయం రూ.2 లక్షలకు లోపు ఉన్న కుటుంబాలకు చెందిన, మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ  ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేసుకోవచ్చు. మెడిసన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజమ్ మొదలైన వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దీనికి అర్హులేనని సోనూ ప్రకటించాడు. ఏది ఏమైనా సోను ప్ర‌య‌త్నాన్ని అభినందించాలి.

 

 

2 Comments
  1. Vedanta Sury says

    soonu sood item is wonderful.. nice to prject like this website.. congrats to organizers

    1. admin says

      tq sir

Leave A Reply

Your email address will not be published.