పోలీస్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్‌

ఈ మ‌ధ్య కాలంలో గద్ద‌లకొండ గ‌ణేష్ సినిమాలో మాస్ లుక్‌తో అద‌ర‌గొట్టిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ తాజాగా పోలుసు పాత్రలో క‌నిపించ‌నున్నాడు. సాగరచంద్ర దర్శకత్వంలో వరణ్‌ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటించనున్నారు. ఈ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథ వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఒక స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్‌లా న‌టించ‌బోతున్నాడు. ఇద‌వ్వ‌గానే ఎప్‌2 సీక్వెల్‌, ఎఫ్ 3లో న‌టించ‌డానికి ఏర్పాటు పూర్త‌వుతున్నాయి. ఇవ‌న్నీ పూర్త‌య్యాకే సాగ‌ర చంద్ర డైరెక్ట‌న్‌లో పోలీసు పాత్ర‌లో వ‌రుణ్ క‌నిపించే మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.  వ‌రుణ్ కెరీర్‌లో ఫిధా, ఎఫ్‌2, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ మూవీలు మంచి పేరు తెచ్చాయి. ఇప్ప‌డు డిఫ‌రెంట్‌గా పోలీసాఫిర్ పాత్ర‌లో అభిమానుల‌ను అలరించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.