పోలవరంలో `దేవసేన` సందడి!

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో బుధవారం అందాల నటి అనుష్క సందడిచేశారు. ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలుతో కలిసి అనుష్క ఇక్కడకు వచ్చారు. మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పడవలో గోదావరి నదిలో విహరించారు. వీరంతా మాస్క్‌లు ధరించి ఉండటంతో వీరిని స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు.