ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6.5లక్షలకు పైగా కేసులు..

ఇదే తొలిసారి అన్న డబ్ల్యూహెచ్‌వో

హైద‌రాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,57,312 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,164,803కు చేరింది. ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని డబ్యూహెచ్‌వో వెల్లడించింది. అందులో ఎక్కువ కేసులు యూరప్‌, అమెరికాలో నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో 9,797 మంది కరోనాతో మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,300,576కు చేరింది. అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక అమెరికా తరువాత స్థానాల్లో భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, రష్యా దేశాలున్నాయి.

Leave A Reply

Your email address will not be published.