ప్లాస్మా ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన రాజ‌మౌళి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, వారి కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తాము క‌రోనా వైర‌స్‌ను జ‌యిస్తామ‌ని, ప్లాస్మాను దానం చేస్తామ‌ని ప్ర‌కటించిన సంగ‌తి విధిత‌మే. ఇప్పుడు కీర‌వాణి, ఆయ‌న త‌న‌యుడు కాల‌భైర‌వ కిమ్స్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మాను డొనేట్ చేశారు. కానీ రాజ‌మౌళి ప్లాస్మాను డొనేట్ చేయ‌లేదు. అయితే ప్లాస్మాను తాను డొనేట్ చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని ట్విట్ట‌ర్‌లో రాజ‌మౌళి తెలిపారు. ‘‘యాంటీ బాడీస్ కోసం టెస్ట్ చేశారు. నా ఐజీజీ లెవల్స్ 8.62గా ఉన్నాయి. కానీ ఆ లెవల్స్ 15గా ఉండాలి. ఈరోజు పెద్దన్నయ్య, భైరవ ప్లాస్మాను డొనేట్ చేశారు’’ అన్నారు ట్వీటాడు రాజమౌళి.

సంగీత దర్శకుడు కీరవాణి ప్లాస్మా దానం

కరోనా పాజిటివ్‌ వచ్చిన సమయంలోనే తాము కరోనా వైరస్‌ను జయిస్తామని, ప్లాస్మాను దానం చేస్తామని చెప్ప‌టిన‌ట్లుగానే కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ కిమ్స్‌ హాస్పిటల్‌లో ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని కీరవాణి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘కిమ్స్‌ హాస్పిటల్లో నేను, నా కొడుకు భైరవ స్వచ్చదంగా ప్లాస్మాను డొనేట్‌ చేశాం. రక్తదానం చేసినట్లే అనిపించింది. ప్లాస్మా దానం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు’ అని కీరవాణి ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

 

Comments are closed.