ప‌ర్యాట‌కుల‌‌తో చిరుత.. నెట్టింట్లో వీడియో వైర‌ల్‌

తీర్థ‌న్ వ్యాలీ (హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌): ఇప్ప‌డు తెలంగాణ‌లో పులి పేరు చేబితే ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో త‌ర‌చూ పులి వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి వ్య‌వ‌సాయ బావిలో ప‌డిపోయిన ఘ‌ట‌న తెలిసిందే. అయితే ఈ పులుల‌కు భిన్నంగా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని తీర్థ‌న్ వ్యాలీలో ఓ చిరుత రోడ్డుపైకి వ‌చ్చింది. దీంతో ప‌ర్యాట‌కులు త‌మ కార్ల‌ను ఆపి ఆ చిరుత‌ను కెమెరాల్లో బంధించ‌డం మొద‌లుపెట్టారు. ఆ జ‌నాల‌పై చిరుత ఎలాంటి దాడి చేయ‌కుండా వారి మ‌ధ్యే తిరుగుతూ స‌ర‌దాగా ఒక వ్య‌క్తిపైకి ఎగ‌బాకుతూ పెంపుడు శున‌కంలాగా ప్ర‌వ‌ర్తించింది. ఏ ఒక్క‌రికి హాని చేయ‌లేదు.. చిన్న గాయం కూడా చేయ‌కుండానే నిమిషానికి పైగా ఆ చిరుత జ‌నాల మ‌ధ్యే తిరిగింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్ర‌వీణ్ క‌శ్వాన్ త‌న ట్విట్ట‌ర్ పేజీలో పోస్టు చేశారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ సృష్టిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.