ప‌వ‌న్ అభిమానుల‌కు ఆ రోజు డ‌బుల్ పండ‌గ‌

సినిమా వ‌చ్చే రెండేళ్ల‌యినా జ‌నంలో జ‌నంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ `ప‌వ‌ర్‌` ఏ మాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్రం వ‌కీల్‌సాబ్‌. బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ‘పింక్’ సినిమాకు రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న వ‌కీల్ సాబ్ మోష‌న్ టీజ‌ర్‌ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చింది. ఆయ‌న పుట్టిన రోజు సెప్టెంబ‌ర్ 2. ఇది `ప‌వ‌ర్` అభిమానుల‌కు నిజంగా పండ‌గ రోజే.. కాగా ఈ రోజే అభిమానుల‌కు డ‌బుల్ పండుగ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీఅవుతోంది. ఇది నిజంగా అభిమానుల‌కు పండగే క‌దా మ‌రి!
ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు దుమ్మురేపుతున్నారు. ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంట్ డౌన్ కూడా ప్రారంభించారు.వ‌కీల్ సాబ్ సినిమాను దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు.
కాగా ‘వకీల్‌సాబ్’ నుంచి ఏదో ఒకటి విడుదల కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ మరింత ఆజ్యం పోసింది.
థమన్.. తన ట్విట్టర్‌లో ‘బుధవారం’ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అంతే.. ‘వకీల్‌సాబ్’ హంగామా షురూ అయ్యింది. సోషల్ మీడియాలో అప్పుడే పవన్ ఫ్యాన్స్ హడావుడి మొదలెట్టేశారు. మరి థమన్ ‘బుధవారం’ అని ట్వీట్ అయితే చేశాడు కానీ, ఆ రోజు ఏం రిలీజ్ చేస్తున్నారు.. అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే మోషన్ పోస్టర్ రిలీజ్ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.