పవన్ `వకీల్ సాబ్` టీజర్ వచ్చేసింది
హైదరాబాద్: అగ్రకథానాయకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. ‘కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. హందీలో ఘన విజయం సాధించిన ‘పింక్` చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్` అనే పేరుతో తెరకెక్కించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్ కథానాయిక. అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షల ముందుకు రానుంది.