ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ: సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని, ఈ ఖరీఫ్‌కు సంబంధించి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరపాలని సీఎం సూచించారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు.

  • అదే రోజున 10 కిలోల రైస్‌ బ్యాగ్స్‌ ఆవిష్కరణ
  • వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ.
  • ఇందు కోసం 9260 మొబైల్‌ యూనిట్లు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలు.
  • 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు రెడీ.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలు.
  • లక్ష్యానికి మించి ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాహనాలు కేటాయింపు.
  • ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, బీసీలకు 3875, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు.
  • వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటా.
  • సంక్షేమ కార్యక్రమంలో భాగంగా, ఆయా కార్పొరేషన్ల ద్వారా వారికి రుణాలు.
  • అందుకోసం ప్రతి జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా లోన్‌ ఫెసిలిటేషన్‌ క్యాంప్‌ల నిర్వహణ
Leave A Reply

Your email address will not be published.