ఫిబ్రవరి 12 @ 4 సినిమాలు

హైద‌రాబాద్‌: సంక్రాంతి సినిమాలు చేసిన వ‌సూళ్లు టాలీవుడ్ నిర్మాతల్లో ఫుల్ జోష్ నింపింది. ఇక క‌రోనా వాక్సిన్ రావ‌డం… జ‌నాలు మామూలు రోజుల్లోలాగా రోడ్డుపైకి రావ‌డంతో ఇప్ప‌డు అంతా కామ‌న్ అయిపోయిందన్న భావ‌న అంద‌రిలోనూ ఏర్ప‌డింది. అన్నింటిలాగా సినీ ప‌రిశ్ర‌మ కూడా గ‌త ప‌ది నెల‌ల నుండి బిజినెస్ లేక వెలవెల బోయింది. ఈ నేప‌థ్యంతో ఇక మీద‌ట సినిమాలు విడుదల చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని సంక్రాంతి అందరికీ ఇచ్చేసింది. అన్నింటికంటే మాస్టర్ సినిమాకు అయితే వారం రోజుల్లోనే ఎప్ప‌టిలానే ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ రావడంతో దర్శక నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. మరోవైపు క్రాక్ సినిమాకు కూడా రెండు వారాల్లోనే 35 కోట్ల వరకు షేర్ వచ్చింది. రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌‌బస్టర్.  ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న 4 సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకేరోజు నాలుగు సినిమాలు వస్తున్నాయంటే పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అందులో రెండు భారీ సినిమాలు కూడా ఉన్నాయి. రెండు మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా వస్తున్నాయి. మరి అవేంటి.. వాటిపై ఉన్న ఆసక్తి ఏంటి చూద్దాం..

 

ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానున్న సినిమాలు

  1. ఉప్పెన: బుచ్చిబాబు తెరకెక్కించిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా.
  2. చక్ర: యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న చక్ర సినిమా.
  3. FCUK: సీనియర్ హీరో జగపతిబాబు నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ FCUK.
  4. శశి: ఆది సాయికుమార్ నటిస్తున్న శశి సినిమా.
Leave A Reply

Your email address will not be published.