ఫుట్‌పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: తెలంగాణ రాజ‌ధాని న‌గ‌రంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాదచారులు గాల్లో నడవాలా అని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వెంటనే ఆక్రమణలను తొలగించాలని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. కాగా ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది మామిడాల తిరుమలరావు వ్యక్తిగతంగా  ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. అలాగే గ‌తంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమగ్ర సర్వే చేసి గతంలో ఉన్న ఫుట్‌పాత్‌లను తొలగిస్తే ఆ ప్రాంతంలో తిరిగి నిర్మించాలని, ప్రజలు సౌకర్యం గా నడిచేలా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దుపరి విచారణను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.