బట్టతల దాచి పెళ్లాడాడంటూ భర్తపై పెళ్లికూతురు కేసు

ముంబ‌యి: కాబోయేవాడిపై అమ్మాయిలు బోలెడు ఆశ‌లు పెట్టుకుంటారు. క‌ట్టుకునే వాడు అలా ఉండాలి… ఇలా ఉండాలి అని… ఇంకా గుర్ర‌మెక్కిరావాల‌ని.. రాకుమారుడు కావాల‌ని ఇలా.. ర‌క‌ర‌కాల ఆశ‌ల‌తో అమ్మాయిల మ‌న‌స్సు నిండిఉంటుంది. అయితే ఇక, ఆశలు, అంచనాలు సరేసరి. కాస్తా అటూ ఇటూ అయినా అమ్మాయి సర్దుకుపోతుంది కానీ, మరీ తేడాలుంటే మాత్రం కష్టమే. ముంబ‌యిలో ఇలాంటి సంఘ‌ట‌నే చోటుచేసుకుంది. పెళ్లి చూపులప్పుడు నిండైన జుట్టుతో అందంగా కనిపించిన భర్త.. పెళ్లయ్యాక భర్త తలను చూసి తట్టుకోలేకపోయింది. తనను మోసం చేశారంటూ భర్త, అతడి కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు పెట్టింది. తన భర్తకు బట్టతల ఉందన్న విషయాన్ని దాచి, తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటూ మీరా రోడ్డుకు చెందిన 29 ఏళ్ల భర్త, అతడి కుటుంబ సభ్యులపై నయానగర్ పోలీస్ స్టేషన్‌లో 27 ఏళ్ల భార్య చీటింగ్ కేసు పెట్టింది. చార్టెడ్ అకౌంటెంట్ అయిన అతడికి సెప్టెంబరులోనే వివాహమైంది. పెళ్లయిన తర్వాత కొత్త పెళ్లి కూతరుకు అసలు విషయం తెలిసింది. తన భర్తకు బట్టతల ఉందని, విగ్ పెట్టుకుంటాడని. దీంతో తట్టుకోలేకపోయింది.
ఈ విష‌యం ముందే తనకు ఎందుకు చెప్పలేదని అత్తమామలను నిలదీసింది. మంగళవారం ఏకంగా నయానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. మరింత కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. అంతేకాదు, శారీర‌కంగా, మాన‌సికంగా వేదిస్తున్నాడ‌ని, తన ఫోన్‌ను హ్యాక్ చేసి చాట్స్, కాల్ రికార్డులను చెక్ చేస్తున్నాడ ఆరోపించింది. కాగా న‌యా న‌గ‌ర్‌ పోలీసులు కేసు న‌మోదు చేస‌కుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

1 Comment
  1. […] బట్టతల దాచి పెళ్లాడాడంటూ భర్తపై పెళ్… […]

Leave A Reply

Your email address will not be published.