భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ

గాంధీనగర్‌: క‌ట్టుకున్న భార్య‌ను కిరాత‌కంగా హ‌త్య చేసి ప‌ట్ట‌ప‌గ‌లు మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని తీసుకెళ్లిన ఘ‌ట‌న ఆదివారం గుజరాత్‌ రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు అతగాడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రాజ్‌కోట్ స‌మీపంలోని వెరవాల్‌ గ్రామం సింధ్‌ క్యాంప్‌ కాలనీకి చెందిన హేమ్‌నాని, నైనా దంపతులకు గత ఏడాది వివాహం అయింది. హేమ్‌నాని స్థానిక ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. వారిరువురి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి.. ఎప్ప‌టిలానే భార్యాభర్తల మధ్య ఆదివారం చిన్న గొడవ మొదలయ్యింది. దాంతో హేమ్‌నాని ఆగ్రహంతో భార్య గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని రోహిషాల గ్రామం వైపు వెళ్లసాగాడు. దాంతో ఆమె కాళ్లు నేల మీద ఉన్నాయి. ఇదేం పట్టించుకోకుండా అలానే ఓ 10 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు వాహనాల మీద అతడి వెనకే వెళ్లి.. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై పాలితాన ఎస్సై మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో నిందితుడు తన భార్య శవాన్ని పాలితాన తాలూకాలోని రోహిషాల గ్రామం చివర ఉన్న అటవి ప్రాంతంలో పడేయాలని భావించినట్లు తెలిపాడు.“ అని మీడియాకు తెలిపారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ ఐ పేర్కొన్నారు.

 

త‌ప్ప‌కుండాచ‌ద‌వండి: బట్టతల దాచి పెళ్లాడాడంటూ భర్తపై పెళ్లికూతురు కేసు

Leave A Reply

Your email address will not be published.