బన్నీ కొత్త లుక్!
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్‌తో మెరిశాడు. కరోనా టైమ్‌లో ఖాళీగా ఉంటున్న అర్జున్ తన రాబోయే చిత్రం పుష్ష కోసం కొత్త లుక్ ట్రై చేశాడు. గుబురుగా గడ్డం పెంచడంతోపాటు తలపై జట్టు కూడా ఎక్కువగా పెంచాడు. అల్లు అర్జున్ హెయిర్ స్టయిల్ గతం కంటే భిన్నంగా ఉంది. చాలా రోజుల తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వచ్చిన అల్లు అర్జున్ కొత్త లుక్‌లో మెరిశాడు. ఈ లుక్‌లో అర్జున్ చాలా అందంగా ఉన్నాడు
ఈ ఏడాది `అల వైకుంఠపురములో..` సినిమాతో భారీ విజయం అందుకున్న బన్నీ.. త్వరలో సుకుమార్ `పుష్ప` సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం బన్నీ కొత్త లుక్ సాధించాడు.
తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్‌కు వచ్చిన బన్నీ అక్కడ తీసుకున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. `చాలా రోజుల తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎలాంటి హడావిడీ లేదు. ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని బన్నీ ట్వీట్ చేశాడు. బన్నీ పోస్ట్ చేసిన ఫొటోకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.