బాధ్యత గల వ్యక్తులు వివరాలు తెలుసుకొని మాట్లాడాలి
హైదరాబాద్ (CLiC2NEWS): దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో బిఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
ఇథనాల్ ఫ్యాక్టరీ.. మాజి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానిదేనని మంత్రి సీతక్క ఆరోపించారు. పిఎంకె డిస్టిలేషన్స్ కంపెనీలో తలసాని కుమారుడు, అల్లుడు భాగస్మాములుగా ఉన్నారన్నారు. 2023 ఏప్రిల్ 3 న అప్పటి ప్రభుత్వం ఫ్యాక్టరీకి అనుమతలు మంజూరు చేసిందన్నారు. జూన్ 15 కాళేశ్వరం ప్యాకేజి నం.27 నుండి ఏడాదికి 18.351 ఎంపిఎఫ్‌టి నీళ్లను కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో మాజి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పరిశ్రమ విషయంలో లేనిపోనివి సృష్టించవద్దని.. బాధ్యత గతల వ్యక్తులు వివరాలు తెలుసుకున్న తర్వాత విమర్శలు చేయాలని హితవు పలికారు.