బామ్మకు చిక్కిన జాక్‌పాట్ చేప
కోల్‌కతా: వృద్ధురాలుకి లక్కు కలిసి రావడంతోరాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం చక్పుల్ధుబి గ్రామంలో పుష్పాకర్ అనే వృద్ధురాలికి నదిలో భారీ చేప వలలో పడడంతో దాన్ని ఆమె రూ 3 లక్షలకు విక్రయించారు. ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం వాడరేవు తీరంలో దోని దేవుడు అనే మత్యకారునికి సెప్టెంబరు 22న అరుదైన కచ్చిలి చేప వళలో పడిన విషయం తెలిసందే.. దానిని జాలరి రూ.1.70 లక్షలకు విక్రయించాడు. మత్యకారుడికి ఇంత పెద్ద మొత్తం రావడం చాలా గొప్ప విషయమని అందరూ అనుకుంటుండగా తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం చక్పుల్ధుబి గ్రామంలో పుష్పాకర్ అనే వృధ్ధురాలికి భారీ చేప పడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జాలరి వలలో చిక్కిన 1.70 లక్షల ఖరీదైన చేప
52 కిలోల చేప చిక్కడంతో స్ధానిక మార్కెట్లో దానికి కిలో 6200 రూపాయలు పలికింది. తనకు దక్కిన చేప తనకు జాక్‌పాట్‌లా మారిందని, ఈ చేపను హోల్‌సేల్ మార్కెట్లో రూ 3 లక్షలకు పైగా విక్రయించానని పుష్ప వెల్లడించారు. ఇంత పెద్ద చేపను తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదని, బెంగాలీలో ఈ చేపను భోలా ఫిష్‌గా పిలుస్తారని మహిళ పేర్కొన్నారు. నది నుంచి ఈ భారీ చేపను బయటకు తీసుకువచ్చి గ్రామంలోకి తీసుకురావడానికి వృద్ధురాలు చాలా కష్టపడ్డారని స్దానికులు తెలిపారు. వారి సాయంతోనే ఆమె భారీ చేపను ఫిష్ మార్కెట్‌కు తీసుకువెళ్లారు. నౌకను ఢీ కొనడంతో ఈ చేప మరణించిందని గ్రామస్తులు చెప్పారు. చేప డీకంపోజ్ కావడం మొదలవకుండా ఉంటే మరింత ధర పలికేదని స్ధానిక వ్యాపారులు తెలిపారు. బ్లబ్బర్గా పిలిచే ఈ చేప కొవ్వును అధిక ధరలకు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని వారు వెల్లడించారు. ఏది ఏమైనా ఈ చేపతో ఆ వృద్ధురాలు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క దెబ్బతో దరిద్రం మొత్తం హుష్ కాకి అయిపోయిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.