జాల‌రి వలలో చిక్కిన‌ 1.70 లక్షల ఖరీదైన చేప

వాడ‌రేవు తీరంలో దొరికిన క‌చ్చిలి చేప‌

చీరాలః ప్ర‌కాశం జిల్లాలోని చీరాల మండలం వాడరేవు తీరంలో అరుదైన క‌చ్చిలి చేప వ‌ళ‌లో ప‌డింది. ఆ ప్రాంతానికి చెందిన దోనిదేవుడు అనే మత్స్యకారుడికి మంగ‌ళ‌వారం చేపల వేటలో ఈ అరుదైన చేప చిక్కింది. అతని వలకు చిక్కిన అరుదైన చేప బ‌రువు 28 కిలోలు. దీంతో తని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చేపను కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీలు పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశాడు. ఆ డబ్బులను చూసి దోనిదేవుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆనందంగా గెంతులేసుకుంటూ ఇంటికెళ్లాడు. కచ్చిలి చేప పొట్ట భాగాన్ని మెడిసిన్ తయారీలో వినియోగిస్తారని..అందుకే అంత ఖరీదు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. ఏది ఏమైనా చాలా రోజుల త‌ర్వాత ఆ ప్రాంతం వాళ్లు అరుదైన క‌చ్చిలి చేప‌ను చూడ‌డంతో ఆనందం వెలిబుచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.