బాలీవుడ్ నటుడు ఆత్మహత్య
ముంబయి: బాలీవుడ్ నటుడు సందీప్ నహర్(33) ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసి తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్షయ్ కుమార్ సినిమా కేసరి, ఎంఎస్ ధోనీ బయోపిక్‌ల్లో సహాయ నటుడిగా సందీప్ నటించాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సోమవారం సాయంత్రం సందీప్ తను చనిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. తన భార్య కాంచన్, అత్త రెండేళ్లుగా తీవ్ర వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. భార్యతో తనకు కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని స్పష్టం చేశారు. ఆత్మహత్యే సమస్యలకు పరిష్కారమని భావించినట్లు తెలిపారు. రాజకీయాల కారణంగా చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో దూరమయ్యాయి అని సెల్పీ వీడియోలో సందీప్ పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.