బిజెపిలోకి దాదా, ధోనీ?

టీమిండియా మాజీ కెప్టెన్లపై బిజెపి కన్ను పడింది. పేరు ప్రఖ్యాతలున్న క్రికెటర్లు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తొంది. మాములుగా స్టార్ క్రికెటర్లు రిటైరైన తర్వాత బిజెనెస్ వ్యవహారాల్లో కానీ, ఏదో ఒక రాజకీయ పార్టలో చేరడం గానీ, లేదా సొంతంగా పార్టీ పెట్టడం కానీ చేస్తుంటారు. ఇదే కోవలోకి సినీ రంగంలోని వారుకూడా అక్కడ జోరు తగ్గాక రాజకీయాల్లోకి రావడం చూస్తుంటాం.. ఇప్పటికే ఎందరో అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బిజెపిలో కానీ చేరి ఉన్నారు. ఈ గ్లామర్ రాజకీయాలకు పనికొస్తుందని ఆయా పార్టీ అధినేతలు వారిని ఆహ్వానిస్తుంటారు. ఇప్పటికే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గౌతమ్ గంభీర్ బిజెపిలో చేరి లోక్‌సభ ఎంపిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు యావత్ దేశం మాజీ క్రికెటర్లయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించుకుంటోంది. ఇద్దరూ బిజెపిలో చేరతారనే వార్తలు ప్రచారం అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే బబుల్ సుప్రియో వంటి స్టార్ సింగర్ బిజెపిలో ఉన్నారు. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడ యూత్‌లో దాదాకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దాదాను తీసుకుంటే బిజెపికి పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రావొచ్చని బిజెపి భావిస్తోంది. దాదా తీసుకున్న ఓ నిర్ణయం కూడా బిజెపిలోకి గంగూలీ వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. గంగూలీ ఆధ్వర్యంలోని ట్రస్టు కోల్‌కతాలో ఓ పాఠశాలను నెలకొల్పేందుకు మమతా ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించింది. ఆ స్థలం వివాదంలో చిక్కుకోవడంతో దాదా ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేశాడు. దీంతో దాదా మమతాతో విభేదించి బిజెపిలో చేరతాడని అక్కడ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్ బిజెపి సిఎం అభ్యర్థి గంగూలీనే అంటూ హాట్ హాట్‌గా డిబేట్ సాగుతోంది.
మరోవైపు తాజాగా రిటైరైన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, మరో ఆటగాడు సురేష్ రైనా కూడా బిజెపిలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. వీరి పొలిటికల్ ఎంట్రీపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధోనీ బిజెపిలో చేరితే.. జార్ఖండ్‌లో బిజెపికి తిరుగుండదని బిజెపి అధిష్టానం భావిస్తోంది.
చూడాలి మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వర్తలు ఎంత వరకు నిజమవుతాయో… ఇది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే మరి.