బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య
హైదరాబాద్ : మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో నటించిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎస్ఆర్ నగర్‌లోని మధురానగర్‌లో తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి ఉరివేసుకున్నారు. బాత్రూమ్కు వెళ్లిన శ్రావణి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో డోర్‌ను పగలకొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మఅతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. మౌన రాగం, మనసుమమత వంటి పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్ ఫ్లోర్లో నివాసముంటున్నారామె. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి (సన్నీ)తో టిక్ టాక్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను.
అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడు. అతడి వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు చేసుకుంది. కుమార్తె ఆత్మహత్యపై ఆమె తల్లి దండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు. తన కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమణి శ్రావణి తల్లి పాపారత్నం ఆరోపించారు. భాగ్య రేఖ సీరియల్లో నటిస్తున్న దేవరాజ్.. తన కూతురు శ్రావణి ద్వారానే సీరియల్స్ లోకి ప్రవేశించాడని చెప్పారు. గతంలో ఎస్ ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాం. అయినా దేవరాజ్ మారలేదు.. పోలీసులు దేవరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పాపారత్నం కోరారు.