బోల్ట్‌కు క‌రోనా

కింగ్‌స్టన్‌: క‌రోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వైర‌స్ భారీన ప‌డుతున్నారు. తాజాగా జ‌మైకా వీరుడు బోల్ట్ కు కూడా క‌రోనా సోకింది. ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ కరోనా పాటిజివ్ వ‌చ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.. ‘శుభోద‌యం‌.. నాకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా ఆప్తులు, మిత్రులు, కుటుంబ స‌భ్యుల‌నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. అందుకే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. అంద‌రూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని బోల్ట్ ట్వీట్ చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.