భారత్లో 58కి చేరిన కరోనా న్యూ స్ట్రెయిన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా న్యూ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. యూకే నుంచి దేశంలో కాలుమోపిన కొత్త రకం కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 58 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నాటికి 38 మందిలో న్యూ స్ట్రెయిన్ ధృవీకరణ కాగా, మంగళవారం కొత్తగా మరో 20 మందిలో న్యూ స్ట్రెయిన్ బయటపడిందని పేర్కొన్నది.