భూస‌మ‌స్య‌ల‌కు ధరణిలో కొత్త ఆప్షన్‌

హైద‌రాబాద్‌: ధ‌ర‌ణి వెబ్‌సైట్లో కొత్త ఆప్ష‌న్ జోడించారు. పేర్ల‌లో అక్ష‌ర దోషాలు, వీస్తీర్ణ న‌మోదులో తేడా, వ్య‌క్తిగ‌త భూముల‌ను నిషేధిత జాబితాలో చేర్చ‌డం వంటి వాటి కోసం `అప్లికేష‌న్ ఫ‌ర్ ల్యాండ్ మ్యాట‌ర్స్‌` అనే అప్ష‌న్ జ‌త‌చేశారు. ఈ మేర‌కు భూసమస్య ఏదైనా దరఖాస్తుకు అవకాశం.. కలెక్టర్లకు పరిష్కార బాధ్యత వ్యవసాయ భూములపై ఎలాంటి సమస్యలున్నా దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సరిహద్దు వివాదాలు, విస్తీర్ణం తప్పుగా నమోదుకావడం, పట్టాదార్‌ పాస్‌బుక్‌ మంజూరు కాకపోవడం.. ఇలా ఎలాంటి సమస్య అయినా ఉన్నతాధికారులకు విన్నవించుకోవచ్చు. ఇందుకోసం ధరణిలో ప్రత్యేకంగా ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది.

తాజాగా ధరణిలో ‘అప్లికేషన్‌ ఫర్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌’ పేరుతో కొత్త ఆప్షన్‌ను వినియోగదారులు ‘యూజర్‌ లాగిన్‌’లోకి వెళ్లిన తర్వాత డ్యాష్‌బోర్డులో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేరు, అడ్రస్‌వంటి వివరాలు నమోదుచేశాక.. దరఖాస్తు చేయాలనుకున్న భూమి సర్వేనంబర్‌ను నమోదుచేయాలి. అనంతరం అక్కడ కనిపించే సరిహద్దు వివాదం, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, ఇతర, పట్టాదార్‌ పాస్‌బుక్‌ (పీపీబీ)ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్యకు సంబంధించిన వివరణను కింద బాక్స్‌లో రాయాలి. చివరగా ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్‌లోడ్‌ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తుంది. కలెక్టర్‌ వాటిని పరిశీలించి.. అవసరమైతే విచారణ జరిపి వారంలో పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.

Leave A Reply

Your email address will not be published.