భద్రాచలం: గోదావరిలో స్నానానికి వెళ్లి.. ముగ్గురు మృతి
భద్రాచలం : భద్రాచలంలో స్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగి ప్రమాదవశాత్తు ఐదుగురు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మృతులు, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.