మరపురాని మహానటి మన సావిత్రి
తెలుగునాటకరంగం నుండి ఎందరో కళాకారులు సినిమారంగానికి వెళ్లి రాణించారు. అలావెళ్లినవారిలో నటి సావిత్రి ఒకరు. వీరు 1936 జనవరి 4న గుంటూరుజిల్లా తాడేపల్లిమండలం చిర్రావూరు గ్రామంలోని శ్శంకరగురవయ్య, సుభద్రమ్మలకు జన్మించారు. (అభిమానులు జనవరి ఆరున ఈమె జయంతి జరుపుకుంటున్నారు) సావిత్రినెలలబిడ్డగా ఉన్న సమయంలో ఆమె తండ్రి టైఫాయిడ్ జ్వరంతో చనిపోయారు.

విజయవాడలోని తన సోదరియింటికి మకాం మార్చారు సుభద్రమ్మగారు. సావిత్రికి వరుసకు పెద్దమ్మ, పెదనాన్న దుర్గాంబ, వెంకట్రామయ్య చౌదరి (వీరిది కులాంతర వివాహం)ల వద్దకు తన చెల్లెలు మారుతీతో కలసివెళ్లింది. అక్కడే కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చదువుకుంటూ, శిష్టాపూర్ణయ్యశాస్త్రి వద్ద సంగీతం, శాస్త్రీయ శిక్షణా పొందారు. కుచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. బాల్యంలోనే ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసపత్రాలు, మెమెంటోలు అందుకున్నారు.
ఆ తరుణంలో నందమూరి, కొంగరజగ్గయ్య గార్లతో కలసి పలు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. తనపెదనాన్న నడిపిన నాటక కంపెనీలో కూడా నటించారు. బుచ్చిబాబు రాసిన ‘ఆత్మవంచనస నాటకంలో బాగాపేరు పొంది, సినిమాలపై దృష్టిసారించి ఎల్వి ప్రసాద్ గారి ‘సంసారం’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. అలా’పాతాళభైరవి’ చిత్రంలో నృత్యం చేసారు. అనంతరం ‘పెళ్ళిచేసిచూడు’ చిత్రంలో రెండో కథానాయకిగా నటించి పరిశ్రమలో నిలదోక్కుకున్నారు.

నృత్యదర్శకుడు వేదాంతరాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు'(1953) ఎల్వి.ప్రసాద్ గారి ‘మిస్సమ్మస (1955) చిత్రాలతో అగ్రకథానాయకిగా తనస్ధానం పదిలపరుచుకున్నారు. అలా ‘దొంగరాముడు(1955) ‘చరణదాసి'(1956) ‘అర్ధాంగి’ (1957) చిత్రాలలో ఈమెనటనకు నీరాజనం పట్టాయి.’మాయబజార్’ (1957)చిత్రం ఆమె అసమాన నటనవైదుష్యం కీర్తిపతాకంలో కలికితురాయి అనిచెప్పాలి. వందల చిత్రాలలో నటించిన ఈమె ‘చిన్నారిపాపలు'(1968) చిత్రానికి ‘వింతసంసారం’ ‘చిరంజీవిస (1969) ‘మాతృదేవత’ (1969)’ప్రాప్తం’- ‘కుళ్ళందు ఊళ్లం'(తమిళం) చిత్రాలకు దర్శకత్వం వహించారు.’నవరాత్రి’ చిత్రంలో పాట కూడా పాడారు. ఎడమచేతివాటం కలిగిన ఈమె ఆరోజుల్లో ‘ప్లెమోత్’ కారులో సింగిల్‌గా డ్రైవింగ్ చేసేవారు. నటిగా ఆమె నోటివెంటవెలువడి పరవశించని పదంలేదు అనుభూతించని వాక్యంలేదు. ఆమె ఓనట విశ్వవిద్యాలయం. తెలుగులో 142, తమిళంలో 94, కన్నడంలో మూడు, మళయాళంలో రెండు, హిందీలో ఐదు చిత్రాలలో నటించారు.

1956లో తమిళనటుడు జెమినిగణేషన్ తో వివాహం, విజయచాముండేశ్వరి, సతీష్ లకు జన్మనివ్వడం, నమ్మినవారు మోసగించడంతో ఆస్తులు కోల్పోవడం, మధ్యానికి బానిసై అనారోగ్యంతో 1981 డిసెంబర్ 26 నకన్నుమూసారు.
గుప్తదానలు ఎన్నోచేసారు. అప్పటిప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిగారిని కలసిమాట్లాడి తనవంటిపై నగలను ప్రధానమంత్రి సహాయనిధికి అందించారు.
గుంటూరుజిల్లా రేపల్లె తాలూకా వడ్డివారిపాలెంలో విద్యాభివృధికి అవసరమైన నిధులు అందజేయడంతో నేటికి ఆమెపేరున ఆపాఠశాల నడుస్తుంది.

అక్కినేనివారితో ‘తోటికోడళ్ళు'(1957) ‘ఆరాధన'(1962) ‘అభిమానం’ (1960) ‘మంచిమనసులు’ (1962) ‘మూగమనసులు'(1964) ‘చదువుకున్నఅమ్మయిలు’ (1963)మనుషులుమమతలు'(1963)’డా.చక్రవర్తి'(1964)’బ్రతుకుతెరువు'(1953) ‘సంతానం'(1955) నందమూరివారితో. ‘కన్యాసుల్కం'(1955) ‘భలేఅమ్మాయిలు'( 1957) ‘పల్లెటూరు'(1952)’పరివర్తన'(1954) ‘కుటుంబగౌరవం’ (1957) ‘ఇంటిగుట్దు’ (1958) ‘అప్పుచేసిపప్పుకూడు'(1959) ‘బండరాముడు'(1959) ‘శ్రీవెంకటేశ్వరమహత్యం'(1960)’విమల’ (1960) ‘దీపావళి’ (1960) ‘కలసిఉంటేకలదుసుఖం'(1961) ‘గుండమ్మకథ'(1962) ‘ఆత్మబంధువు’ (1962) ‘నర్తనశాల’ (1963) ‘నాదీ ఆడజన్మే’ (1965) ‘పాండవవనవాసం'(1965) ‘దేవత'(1965)’నిర్ధోషి’ (1967)’కంచుకోట'(1967) ‘రక్తసంబంధం'(1962) వంటిచిత్రాలలో నటించారు.
-డా.బెల్లంకొండనాగేశ్వరరావు










