మళ్ళీ పెరిగిన పసిడి ధర
న్యూఢిల్లీ: ఢిల్లీలో వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు పెరిగాయి. సోమవారం కూడా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.277 పెరిగి రూ.52,183కు చేరింది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముగియడమే బంగారం ధరలు పెరుగడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు. గత ట్రేడ్లో 10 గ్రాముల బంగారం రూ.51,906 వద్ద ముగిసింది. ఢిల్లీలో వెండి ధరలు కూడా సోమవారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.694 పెరిగి రూ.65,699కి చేరింది. గత ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,005 వద్ద ముగిసింది. కాగా, ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1960 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.75 అమెరికన్ డాలర్లు పలికింది.