మహారాష్ట్ర సీఎంపై కంగన ఫైర్!

మ‌హారాష్ట్రం సిఎంకు, బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌కు మధ్య గ‌త కొంత‌కాలంగా ట్వీట్ల వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిఎం ఉద్ధవ్ ఠాక్రేపై నటి కంగనా రనౌత్‌ మరోసారి విరుచుకుపడింది. శివసేన దసరా ర్యాలీలో కంగనపై ఉద్ధవ్ పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బతుకు దెరువు కోసం ఇక్కడకి వచ్చిన కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా కంగన స్పందించింది.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:మ‌రి వాళ్లేమైనా బంగ్లాదేశీయులా?: ఉద్ధ‌వ్‌

“రౌత్ నన్ను హరమ్‌ఖోర్ అని పిలిచాడు, ఉద్ధవ్ నన్ను నమక్ హరం అని పిలిచాడు, ముంబై నాకు ఆశ్రయం ఇవ్వకపోతే నా రాష్ట్రంలో నాకు తిండి దొర‌క‌దని అన్నారు.నాకు మీ కొడుకు వయసుంటుంది. స్వయం ప్రతిభతో ఎదిగిన ఒంటరి మహిళ గురించి ఇలా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గు వేస్తోంది. ముఖ్యమంత్రి గారూ.. మీరు ఓ చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్` అని ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేసింది.

అనంతరం.. `సీఎంగారూ.. మీలా తండ్రి అధికారం, డబ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదు. నేను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. నేను కూడా ఓ గొప్ప‌ వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. కానీ, నేను ఆ వారసత్వం మీద, సంపద మీద జీవించ‌ద‌ల‌చుకోలేదు. కొంతమందికి ఆత్మగౌరవం, స్వీయ విలువ ఉంటాయ`ని కంగన ట్వీట్ చేసింది.

 

Leave A Reply

Your email address will not be published.