మీ ఆస్తులను ధరణిలో ఇలా నమోదు చేసుకోండి…

హైదరాబాద్‌ : క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌కు చెక్ పెడుతూ ఆస్తుల వివరాలను యజమానులే అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మీ సేవా పోర్టల్‌ లింక్‌ను ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్‌ నెంబర్లకు పంపుతోంది. ఆ లింక్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు కల్పించారు. ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీంతో క‌రోనా నేప‌థ్యంలో వివరాల సేకరణకు ప్రభుత్వ విభాగాల సిబ్బంది ఇళ్ల వద్దకు వస్తే ప్రమాదవశాత్తు కరోనా సోకుతుందేమో అన్న ప్రజల భయం మరో వైపు. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఆస్తుల వివరాలను యజమానులే అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం.

మీ సేవా పోర్టల్‌ లింక్ః   

http://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/User

Interface/Citizen/RevenueServices/SMSSendOTP.aspx

ఇక్క‌డ పైన పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేయాలి. వెబ్ పేజీ ఓపెన్ అవ్వ‌గానే అందులో వారు అడిగిన డాటా వివ‌రాల ప్ర‌కారం నమోదు చేసుకుంటూ వెళ్లి, చివరగా అన్ని పరిశీలించుకున్న తర్వాత ఫైనల్‌గా సేవ్‌ చేయాలి.

పౌరులు నమోదు చేసిన ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌తోపాటు.. సంబంధింత కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు కూడా తెలుస్తుంది. దీంతో మీ ఇల్లు/భవనం వద్దకు సిబ్బంది వచ్చే అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఆస్తుల వివరాల సేకరణకు సిబ్బంది దాదాపుగా వెళ్లరని, సమాచార లోపంతో వెళ్లినా, అప్పటికే నమోదు చేశామని సంబంధిత యజమానులు చెబితే వెనుతిరుగుతారని జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు. ‘ఇప్పటికైతే మీ సేవా పోర్టల్‌ యాక్సెస్‌ మాకు రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అనుసంధానం జరుగుతుంది. దీంతో ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలు మాకు తెలిసిపోతాయి’ అని అధికారి చెప్పారు.

 

Leave A Reply

Your email address will not be published.