TS: ముఖ్య‌మంత్రి కెసిఆర్ కు క‌రోనా నెగెటివ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావుకు క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయింది. సిఎం కెసిఆర్ కు ఇవాళ (బుధ‌వారం) రాపిడ్ యాంటిజ‌న్‌, ఆర్టిపిసిఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాపిడ్ ప‌రీక్ష‌ల‌లో సిఎంకు నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీపిసిఆర్ ప‌రీక్ష ఫ‌లితం రేపు వెల్ల‌డికానుంది.

స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో ఈ నెల 19న సిఎం కొవిడ్ ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ద‌ర‌ణ అయింది. దీంతో ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించ‌డంతో ఎర్ర‌వ‌ల్లిలోని ఆయ‌న వ్య‌వ‌సాయ‌క్షేత్రంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి వ్య‌క్తిగ‌త వైద్యుడు ఎంవి రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కెసిఆర్ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.