సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ వాణీదేవి

హైదరాబాద్‌: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వాణీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి గెలుపునకు కృషిచేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వాణీదేవిని కేసీఆర్‌ అభినందించి శాలువాతో సత్కరించారు. వాణీదేవికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అభినందించారు.

(హైదరాబాద్‌లో.. టిఆర్ఎస్ విజ‌య `వాణి`)

Leave A Reply

Your email address will not be published.