హైదరాబాద్లో.. టిఆర్ఎస్ విజయ `వాణి`
ఉత్కంఠ పోరులో వాణీదేవి గెలుపు.. కాసేపట్లో ప్రకటన
హైదరాబాద్: మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయింది. ఈ ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. మొదటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతున్న వాణీదేవి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై రెండో ప్రాధాన్యత ఓటుతో వాణీదేవి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 91 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం వాణీదేవికి తొలి ప్రాధ్యానతా ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు.
వాణీదేవి గెలుపునకు అవసరమైన కోటా రావాలంటే.. ఇంకా ఆమెకు 19,251 ఓట్లు రావాల్సి ఉంది. మరో వైపు ఎవరికీ కోటాకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో బిజెపి అభ్యర్థి రామచంద్రారావు ఎలిమినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్లు సమాచారం.
హైదరాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి గెలుపుతో దీంతో హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో సంబరాలు మొదలయ్యాయి. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ ఎస్ శ్రేణులు సరూర్ నగర్ స్టేడియం వద్దకు చేరుకొని సంబురాలు చేసుకున్నారు. కాసేపట్లో పూర్తి వివరాలు రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతోపాటు నల్లగొండ స్థానంలో బీజేపీ నాలుగో స్థానంలో నిలిచింది.