మెగా హీరో వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్

మెగా కుటుంబాన్ని కరోనా టెన్షన్ పెడుతుంది. తాను క‌రోనా భారిన ప‌డిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం క‌థానాయ‌కుడు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా, మ‌రో మెగా హీరో కూడా కొవిడ్ బారిన ప‌డ్డారు. నాగ‌బాబు త‌న‌యుడు వ‌ర‌ణ్ తేజ్‌కు కూడా క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా పంచుకున్నారు.

“ఈ రోజు ఉద‌యం నాకు క‌రోనా పాటిజివ్ అని తేలింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా. త్వ‌ర‌లోనే తిరిగి వ‌స్తా. మీ ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు“
అని ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.

వరుణ్ తేజ్ కూడా తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. కానీ లక్షణాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని.. క్వారంటైన్ లో ఉన్నానని చెప్పాడు వరుణ్ తేజ్. చరణ్ కు కూడా ఎలాంటి లక్షణాలు లేవు. అయినా కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉన్నారు ఈ ఇద్దరు మెగా హీరోలు. దాంతో ఇప్పుడు మిగిలిన మెగా కుటుంబం కూడా కరోనా టెస్టులకు సిద్ధమవుతున్నారు.

(రామ్‌ చరణ్‌కి కరోనా పాజిటివ్‌)

 

 

Leave A Reply

Your email address will not be published.