మెసేజ్ చూడకపోతే క్షమించండి: సోనూసూద్
ముంబయి: కరోనా కష్టకాలంలో పేదలకు సహాయం చేస్తూ ప్రముఖ నటుడు సోనూసూద్ నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా, లాక్డౌన్ సమాయంలో వేలాది మందికి సహాయం చేసిన సోనూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలిపోయినా ఇప్పటికి ఆయన మూలంగా ఎవరో ఒకరు సహాయం పొందుతూనే ఉన్నారు. ట్విట్టర్లో ఆయనకు ఎవరు సహాయం కావాలని పోస్టు పెట్టినా వెంటనే సోనూ స్పందిస్తున్నారు. పెట్టిన ప్రతి వారికి ఏదో ఒకటి తనకు చేతనైన సాయం చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమందికి తనకు తోచినంత సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా దేశవ్యాప్తంగా సాయం చేయాలంటూ మెయిల్స్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టా ద్వారా గురువారం తనకు వచ్చిన వినతులను సోనూ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. అందులో 1137 మెయిల్స్, 19వేలు ఫేస్బుక్ మెసేజ్లు, 4812 ఇన్స్టా, మరో 6741 మెసేజ్లు ట్విటర్ ద్వారా వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ..
”సహాయం చేయాలంటూ నాకు రోజూ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మెసెజ్లు. అందరి కష్టాలు తెలుసుకొని సాయం అందించడం కష్టమే.. కానీ నా శక్తి ఉన్నంత వరకూ ప్రయత్నిస్తా.. ఎవరివైదైనా మెసెజ్లు చూడకపోతే దయచేసి నన్ను క్షమించండి” అంటూ ట్వీట్ చేశారు.