మళ్లీ ఆసుప్రతిలో చేరిన అమిత్‌షా
మళ్లీ ఆసుప్రతిలో చేరిన అమిత్‌షా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఇటీవల కొవిడ్ వైరస్ సోకడంతో ఆయన గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే..శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న అమిత్ షా మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. పది రోజుల క్రితం అంటె ఆగస్టు 2న అమిత్ షా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గురుగ్రామ్ ఆస్పత్రిలో ఆయనకు కరోనా తగ్గిందని నివేదికలు వచ్చాయి. ఆగస్టు 14న ఆయనకు నిర్వహించిన కొవిడి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అమిత్‌షా ట్వీట్ చేశారు. ఇంతలోనే ఆయనకు శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. కరోనా వైరస్ లక్షణాల్లో ఒకటైన శ్వాసకోస సమస్యలు రావడం పట్ల బిజెపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమిత్‌షాకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్్స డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో అమిత్‌షాకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్్స వైద్యులు ప్రకటించారు. ఆయన అర్థరాత్రి 3 గంటలకు ఎయిమ్్స ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. అమిత్‌షా ఆరోగ్యంపట్ల బిజెపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.