యువకుడిపై యువతి యాసిడ్ దాడి

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో నంద్యాల మండలం పెద్ద కొట్టాలకు చెందిన నాగేంద్రకు ముఖంపై గాయాలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ నాగేంద్ర అనే యువకుడిపై యాసిడ్ పోసింది. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. 20 రోజుల క్రితం అతడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో పగ పెంచుకున్న ఆ యువతి గత వారమే అతనిపై యాసిడ్ పోసింది. ఈ ఘనటలో యువకుడికి చేయి కాలింది. ఆ గాయం నుంచి కోలుకోకముందే మరోసారి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటనపై నంద్యాల గ్రామీణ సీఐ దివాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.