యూకే రిటర్న్స్: కర్ణాటకలో 14, కేరళలో 8 మందికి…
ఢిల్లీ: యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే యుకె నుంచి వచ్చిన పలువురికి కొవిడ్ నిర్ధారణ కావడంతో వారిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సంస్థాగత క్వారంటైన్లో ఉంచార. తాజా యుకె నుంచి వచ్చిన 14 మంది కర్ణాటక వాసులకు, కేరళకు వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముంఉదు భువనేశ్వర్‌లో బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన నాలుగేళ్ల చిన్నారికి కూడా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.
కరోనా కొత్త స్ట్రెయిన్ ను గుర్తించే సరికి ఆ వైరస్ అనేక ప్రాంతాలకు వ్యాపించింది. యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. అయితే, డిసెంబర్ 23 వ తేదీ వరకు యూకే నుంచి వచ్చిన వ్యక్తులను ట్రేస్ చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యూకే నుంచి కేరళ వచ్చిన వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలపై దృష్టి సారించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.