రఘునందన్ రావు అత్తారింట్లో పోలీసుల సోదాలు

సిద్దిపేట : దుబ్బాక బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు ఇళ్ల‌లో, కార్యాల‌యాలు, ఆయ‌న బంధువుల‌ ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమ‌వారం మ‌ధ్యాహ్నం సోదాలు చేశారు. ఏక‌కాలంలో 8 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వ‌హించార‌ని తెలిసింది. కాగా త‌నిఖీల విష‌యంతెలుసుకుని ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మ‌ధ్య‌‌లో నిలిపేసి ఆయ‌న  త‌న‌ అత్తారింటికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఈ త‌నిఖీల్లో భాగంగా ర‌ఘునంద‌న్ బందువుల ఇంట్లో ఉన్న‌ రూ. 18.67 ల‌క్ష‌ల‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిసింది.

కాగా ఈ క్ర‌మంలో పోలీసులు, బిజెపి కార‌కర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అధికారులు స్వాధీనం చేసుకున్న న‌గ‌దులో కొంత మొత్త‌న్ని బిజెపి శ్రేణులు లాక్కెల్లారు. మారోవైపు టిఆర్ ఎస్‌కు చెందిన సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ రాజ‌న‌ర్సు ఎంట్లోనూ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సోదాల‌తో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.