రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగైంది: జీవిత

హైదరాబాద్‌: క‌రోనా బారిన ప‌డి ఐసియూలో చికిత్స పొందుతున్న సినీనటుడు రాజశేఖర్ కోలుకుంటున్నార‌ని ఆయన భార్య జీవితా రాజశేఖర్ వెల్ల‌డించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. సిఎన్‌సి ఆస్ప‌త్రి డాక్టర్లు నిత్యం ప‌ర్య‌వేక్షిస్తూ ఆయ‌న‌ను ప్రాణ‌పాయం నుంచి బ‌య‌ట‌ప‌డేశారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది` అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.