రాజధానిలో రోడ్డెక్కనున్న సిటీ బస్సలు
25 శాతం మాత్రమే నడపాలని సర్కార్ నిర్ణయం
హైదరాబాద్: సుమారు ఆరు నెలల తర్వాత హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నయి. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సులు నడిపేందుకు సర్కార్ ఆర్టీసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 187 రోజుల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. అది కూడా 25 శాతం నడిపేందుకు మాత్రమే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిస్థితిని బట్టి దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు. రాజధానిలో ఆర్టీసీ బస్సులపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌తో ఈ రోజు సిఎం కెసిఆర్ చర్చించారు. అనంతరం బస్సులు నడపడానికి సిఎం అనుమతి ఇచ్చారు. దీంతో ఏ ఏ రూట్లలో బస్సులు నడపాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్సులు నడపాలని ఆలోచిస్తున్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా రేపటి నుంచే ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించనున్నారు.