రామ్‌తో త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో చేయనున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్.. ఈ యేడాది అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తన తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. కానీ ఎన్టీఆర్.. మాటల మాంత్రికునితో సినిమా చేయాలంటే ముందుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తి చేయాల్సిందే. ఆ సినిమా పూర్తి కానిదే.. తారక్..వేరే ప్రాజెక్ట్స్‌కు కమిట్ కాకూడనేది జక్కన్న నిర్ణయం. అందుకు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయాలనకున్న ప్రాజెక్ట్ మరో ఆరు నెలలు ఆలస్యం కానుంది. ఈ లోపు త్రివిక్రమ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను రామ్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమాను త్రివిక్రమ్.. రామ్‌కు సంబంధించిన స్రవంతి పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్‌కు దర్శకుడిగా మొదటి అవకాశం స్రవంతి రవికిషోర్.. బ్యానర్‌లో తెరకెక్కిన ‘నువ్వే నువ్వే’ సినిమాతో వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యానర్‌లో త్రివిక్రమ్ మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. కానీ అప్పట్లో ఈ సినిమా వీలు పడలేదు. ‘నువ్వే నువ్వే’ తర్వాత దర్శకుడిగా త్రివిక్రమ్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలో మాటల మాంత్రికుడు రామ్ పోతినేనితో ఒక వెరైటీ సబ్జెక్ట్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. చాలా రోజుల తర్వాత తన ఓన్ బ్యానర్ వంటిది అయినా.. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌లో కాకుండా స్రవంతి బ్యానర్‌లో ఈ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఈ నెల 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెను అ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసింది త్రివిక్రమే. తర్వాత రామ్ తోనూ హలో గురూ ప్రేమ కోసమే అనే సినిమాలో నటించింది అనుపమ. ఇప్పుడు త్రివిక్రమ్ కోసం మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను 40 కోట్లలోపే తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటిలాగే హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుందని ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. అప్పుడు అ..ఆ సినిమాను కూడా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించి భారీ లాభాలు అందుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు రామ్ సినిమా విషయంలో కూడా ఇదే జరగబోతుంది. మరోవైపు ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు ఎన్టీఆర్. మరి పూరీ ఇస్మార్ట్ శంకర్‌తో 40 కోట్లకు చేరువగా వచ్చిన రామ్.. త్రివిక్రమ్ హ్యాండ్ తో ఎక్కడికి వెళ్లనున్నాడో..?