రాష్ర్ట వ్యాప్తంగా ‘ధ‌ర‌ణి’ సేవ‌లు ప్రారంభం

హైద‌రాబాద్: ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు, మ్యూటేష‌న్ల సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని 20 మండ‌లాలు మిన‌హా 570 త‌హ‌సీల్దారు కార్యాల‌యాల్లో నేడు సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సేవ‌ల‌ను శంషాబాద్ తాసిల్దార్ కార్యాల‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉద‌యం లాంఛ‌న‌గంగా ప్రారంభించారు. ధ‌ర‌ణి సేవ‌ల ప్ర‌క్రియ‌ను రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్ వివ‌రించారు. గత నెల 29న సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధ‌ర‌ణి సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. ఇవాళ 946 మంది రిజిస్ర్టేష‌న్ల కోసం న‌గ‌దు చెల్లించారు. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నార‌ని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు

గత నెల 29న సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్‌ చొప్పున కేటాయించారు. మధ్యలో అరగంటపాటు భోజన విరామం ఉంటుంది. ఈ లెక్కన సగటున రోజుకు 8 స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉన్న ది. భవిష్యత్‌లో తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లు మరింత వేగంగా పనిచేయగలుగుతారని, అప్పుడు రోజుకు 10 స్లాట్లు బుక్‌ చేసినా సులభంగా పూర్తి చేయగలుగుతామని అధికారులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం.. రిజిస్ట్రేషన్లన్నీ తాసిల్దార్‌ మాత్రమే అప్రూవ్‌ చేయాల్సి ఉంటుంది. వారు సెలవుపై ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డిప్యూటీ తాసిల్దార్లకు అవకాశం ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.