రిప‌బ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా రిప‌బ్లిక్ ఆఫ్ సురినామ్ దేశ అధ్య‌క్షుడు

న్యూఢిల్లీ: జ‌న‌వ‌రి 26న నిర్వ‌హించే భార‌త్ రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా రిప‌బ్లిక్ ఆఫ్ సురినామ్ దేశ అధ్య‌క్షుడు చంద్రికాప‌ర్సాద్ సంటోఖి రానున్న‌ట్లు ప్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించింది. మొద‌టగా బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను ముఖ్య అతిథిగా పిలిచినా.. అక్క‌డ పెరుగుతున్న క‌రోనా కేసుల కార‌ణంగా తాను రాలేన‌ని ఆయ‌న చెప్పారు. దీంతో సురినామ్ దేశాధ్య‌క్షుడిని ఆహ్వానించారు. ఈయ‌న భార‌త సంత‌తి వ్య‌క్తే కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా సురినామ్ ద‌క్షిణ అమెరికా ఖండం ఈశాన్య మూల‌న ఉండే ఓ చిన్న దేశం. ఇది గ‌తంలో డ‌చ్ కాల‌నీగా ఉండేది. గ‌తేడాది జులైలో ఈయ‌న సురినామ్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ దేశ జ‌నాభా కేవ‌లం 5 ల‌క్ష‌ల 87 వేలు కాగా.. అందులో 27.4 శాతం మంది భార‌త సంత‌తి వాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your email address will not be published.