డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన కెటిఆర్

హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఆత్మగౌరవానికి ప్రతీక అని పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. జియగూడలో డబుల్ బెడ్రూం గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాను ప్రారంభించారు. ఇక్కడ 840 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మంచింది. అక్కడ తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత 75 యేళ్లలో “ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా“అని అంటున్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని ఆయన కొనియాడారు. స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా నిరుపేద ఆడపిల్లల వివాహాలకు లక్షా నూట పదహారు రూపాయాలు అందిస్తున్నామని తెలిపారు. పేదవారికి ఒక మేనమామల కేసీఆర్ ఉన్నారు. పండుగ వాతావరణంలో గృహా ప్రవేశాలు జరుపుకుంటున్నాం. నగరం మొత్తంలో లక్ష డబుల్ బెడ్రూంలు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ జియగడూ, గోడె కి కబర్, కట్టెలమండిలో కలిసి 1152 ఇండ్లు పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు. ఇండ్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోరు.
ఏ ఒక్కరికీ కూడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దు. కేవలం అధికారులు మాత్రమే పారదర్శకంగా ఇండ్ల పంపిణీ చేస్తారని తెలిపారు. అంబేద్కర్ నగర్లో అంగన్వాడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. లైబ్రరీ కూడా అవసరం కాబట్టి అది కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 2 లక్షల 75 వేల పైచిలుకు ఇండ్లు కడుతున్నాం. 18 వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతున్నాం. ఈ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 70 వేల కోట్లు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. త్వరలో మూసీ సుందరీకరణ పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో పాటు పలువురు పాల్గొన్నారు.
Ministers @KTRTRS, @YadavTalasani, and @mahmoodalitrs inaugurated 840 2BHK Dignity Houses at Jiyaguda in Hyderabad. The @GHMCOnline constructed these houses at a cost of Rs 71.40 Crore. pic.twitter.com/BiDyZKxkvU
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 26, 2020